POSHAN ABHIYAN: పోషణ్ అభియాన్ కార్యక్రమ అమలులో భాగంగా 2021 సంవత్సరానికి గానూ తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నడిపించటంలో కీలక పాత్ర పోషించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, ఆ జిల్లా కలెక్టర్లను అభినందించారు.
ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. మంత్రి సత్యవతి రాఠోడ్ హర్షం - మంత్రి సత్యవతి రాఠోడ్
POSHAN ABHIYAN: పోషణ్ అభియాన్ కార్యక్రమ అమలులో భాగంగా 2021 సంవత్సరానికి గానూ తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన సంబంధిత అధికారులను ఆమె అభినందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఇప్పటికే అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్న మంత్రి.. పోషణ్ అభియాన్ నిర్వహణలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉత్తమమైనదిగా ఎంపికై.. మరోసారి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా దక్షతను చాటిందన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ సారించి.. ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నారని వివరించారు. దీనికి తోడు ఈ ఏడాది నుంచి అమలు చేస్తోన్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమంలో కుమురం భీం జిల్లా ఉండటం సంతోషించాల్సిన విషయమన్నారు.
ఇదీ చదవండి: అప్రకటిత విద్యుత్ కోతలు... ఇన్వర్టర్లకు పెరిగిన గిరాకీ