ktr tweet on rahul tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సెటైర్స్ వేశారు. ''రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ మాత్రం ఎప్పటికీ తెలంగాణలో ఉంటారు'' అంటూ పంచ్ వేశారు. దానితోపాటు టెక్ట్స్‌కు స్మైలీ ఎమోజీని జోడించారు. అంతేకాకుండా ఆ డైలాగ్‌కు తగ్గట్టుగా ఉన్న తన మేనరిజం ఫొటోను కూడా షేర్ చేశారు.
KTR on Rahul tour: రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్.. రేవంత్ కౌంటర్! - rahul tour issue
ktr tweet on rahul tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టూర్‌పై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
revanth counter to ktr: ఈ పోస్టుకు వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ వేశారు. ''కేటీఆర్ గారూ… మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు! కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే'' అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి: