KTR Tweet To External Affairs Minister : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు మాత్రం త్వరగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.
తెలంగాణ సర్కార్ చర్యలు..
మరోవైపు.. ఉక్రెయిన్‌లోని తెలుగువారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణవాసుల క్షేమం కోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దిల్లీలోని తెలంగాణభవన్, రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెల్ప్‌లైన్ సెంటర్లకు రాత్రి నుంచి 75 ఫోన్ కాల్స్ వచ్చినట్లు సీఎస్ వెల్లడించారు.
దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్.. విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని సీఎస్ చెప్పారు. ఉక్రెయిన్‌లో మొత్తం ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇప్పటి వరకు లేదన్నారు. కన్సల్టెన్సీల ద్వారా వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని.. కౌన్సిలింగ్ ఇస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సి నెంబర్లు..
ఈ.చిట్టిబాబు ఏఎస్ఓ : 040-23220603
ఫోన్ నంబర్ : +91 9440854433
ఈ -మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in
దిల్లీ తెలంగాణ భవన్లో సంప్రదించాల్సిన నెంబర్లు..
విక్రమ్‌సింగ్‌మాన్ : +91 7042566955