కేటీఆర్ సర్.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? అని ఓ అభిమాని ట్విటర్ వేదికగా అడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సరదాగా సమాధానం ఇచ్చారు. (ఆస్క్ కేటీఆర్)పేరుతో ఆదివారం సాయంత్రం ట్విటర్ వేదికగా ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ యంగ్ లుక్‌లో ఉన్న ఫొటోను అభిమాని పంచుకుంటూ పై ప్రశ్న అడగ్గా, అందుకు కేటీఆర్ బదులిస్తూ ‘‘బాలీవుడ్, హాలీవుడ్, మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పంచుకున్నారు.
మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?
కేటీఆర్: రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ
ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ ప్రారంభించేలా చూస్తారా?
కేటీఆర్: తప్పకుండా
కరోనా విజృంభించిన 2020లోనూ తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మీ దార్శనికమైన నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. మరి 2021 ఎలా ఉండబోతోంది?
కేటీఆర్: మా వంతు కృషి చేస్తాం సోదరా! కేసీఆర్‌గారి నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం పెట్టుబడులు వచ్చేందుకు ప్రధాన కారణం. మీకు ధన్యవాదాలు
తెలంగాణకు కొవిడ్ వ్యాక్సిన్ సప్లయ్ ఎలా ఉంది?
కేటీఆర్: దేశ వ్యాప్తంగా కొరత ఉందని తెలిసింది.
అనంతగిరి హిల్స్ గురించి కేసీఆర్ ఎన్నో సార్లు మాట్లాడారు. అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకానికి కేంద్రంగా మారుస్తారని అనుకుంటున్నా.
కేటీఆర్:తప్పకుండా చేస్తాం. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబిత గారు ఆ దిశగా పనులు మొదలు పెట్టారు.
జిల్లాల్లో ఐటీ హబ్స్ ప్రారంభించే ఆలోచన ఉందా?
కేటీఆర్: మహబూబ్‌నగర్‌ను అలా తీర్చిదిద్దుతున్నాం.
అన్నా.. తెలంగాణలో ప్రభుత్వ పథకాలన్నీ బాగున్నాయి. కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్..
కేటీఆర్: తప్పకుండా నాయక్..
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2021లో తెలంగాణలో లాక్డౌన్ ఉంటుందా?
కేటీఆర్: అది మంచి ఆలోచన కాదని నా అభిప్రాయం.
జాతిరత్నాలు ఎలా ఉంది?
కేటీఆర్: చాలా బాగా నచ్చింది. పూర్తి హాస్యభరిత చిత్రం.
సర్.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా కూతురిని హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం సరిపోవడం లేదు.
కేటీఆర్: తాజా బడ్జెట్లో ఇందుకోసం రూ.2వేల కోట్లు కేటాయించాం. వీలైనంత త్వరగా ఆ పనులు మొదలు పెడతాం.
సర్.. సిద్ధిపేట గురించి ఒక్క మాట చెప్పండి.
కేటీఆర్: తెలంగాణలోని ఉత్తమ పట్టణాల్లో ఒకటి.
మరిన్ని వ్యాక్సిన్లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు కోరింది. అక్కడి నుంచి సమాధానం వచ్చిందా సర్?