KTR Viral Video: తెరాసలోకి రావాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గ భాజపా నాయకుడికి కాల్ చేసినట్లు.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన గట్టుప్పల్ మండల కేంద్ర గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నామం జగన్నాథానికి కేటీఆర్ ఫోన్ చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మీద ప్రేమతో భాజపాలోకి పోలేదని.. సొంత ప్రయోజనాల కోసం వెళ్లారని కేటీఆర్ తెలిపారు.
KTR Viral Video: 'మునుగోడు'లో సహకరించండంటూ ఆ భాజపా నేతకు కేటీఆర్ ఫోన్ - భాజపా నేతకు కేటీఆర్ ఫోన్
KTR Viral Video: తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల అగ్రనేతలంతా నియోజవర్గంలో మోహరించారు. ఇంటింటికీ తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ భాజపా నేతకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కాల్ చేసినట్లు.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది.
కేటీఆర్ కాల్
'రాజగోపాల్ రెడ్డి నిజమైన భాజపా - ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు. ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ఆ ప్రాంతంలో మీకు మంచి పేరుందని విన్నాం. ఈ ఎన్నికల్లో మాకు సహకరించండి’’ అని జగన్నాథాన్ని కేటీఆర్ కోరుతున్నట్లు ఈ వీడియోలో ఉంది. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చదవండి: