ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి' - ktr about seasonal diseases

సీజనల్ వ్యాధుల నియంత్రణకు శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను ఐదు రెట్లు పెంచాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

KTR ON SEASONAL DISEASE
సీజనల్ వ్యాధులపై కేటీఆర్

By

Published : May 19, 2020, 11:52 AM IST

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి మంత్రి కేటీఆర్.. అధికారులతో సమీక్షించారు. సీజ‌న‌ల్ వ్యాధులను అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన చ‌ర్యల గురించి చ‌ర్చించారు. హైదరాబాద్‌లో జోన్లలోని పరిస్థితులను బట్టి... ప్రతి ఐదు రోజులకు ఒకసారి చొప్పున నెలకు ఐదువిడతలుగా యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

హై రిస్క్ ప్రాంతాల‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్న మంత్రి... సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టడంలో ప్రజ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంపొందించాల‌న్నారు. అందులో భాగంగా ఈ నెల 19 నుంచి వారం పాటు కాల‌నీ, అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లతో భౌతికదూరం పాటిస్తూ స‌మావేశాలు నిర్వహించాలని సూచించారు. డెంగ్యూ, మ‌లేరియా, స్వైన్‌ప్లూ, చికెన్ గున్యా వ్యాధుల‌పై చైత‌న్యప‌ర్చాల‌ని ఆదేశించారు. ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో పేరుకు పోయిన ఘన వ్యర్థాలను వెంటనే తొలగించాలన్న కేటీఆర్.. దానికి అయ్యే ఖర్చును ప్లాట్ యజమానులనుంచే వసూలు చేయాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాలపై ప్రజలలో చైతన్యం కలిగించాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి:కరోనా వైరస్​ మన దుస్తులకు అంటుకుంటుందా?

ABOUT THE AUTHOR

...view details