తెలంగాణ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. తెరాస పాలనలో వైఫల్యాలు అంటూ భాజపా ఛార్జ్‌షీట్ విడుదల చేయడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినందుకు ఛార్జ్‌షీట్ వేశారా? అని ప్రశ్నించారు. ఛార్జ్‌షీట్ చేయాల్సి వస్తే.. మోదీ ప్రభుత్వం మీద 132 కోట్ల మంది ఛార్జ్షీట్లు వేయాలన్నారు.
హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు
దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ లో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు.. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. ఓట్ల కోసం భాజపా నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వాహనాల చలానాలు కడతామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీలపై.. కేటీఆర్ వ్యంగస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి భాజపా నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.