తెలంగాణ: మేయర్, ఛైర్పర్సన్ ఎంపికపై తెరాస వ్యూహాలు
తెలంగాణ పురపోరులో తెరాస జయభేరీ మోగించింది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. పార్టీ గెలుపుతో గులాబీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తెలంగాణ భవన్లో ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.
Ktr conduct the meeting eith mlas and party leaders
తెలంగాణ భవన్లో సంబురాలు మొదలయ్యాయి. పురపోరులో కారు జోరుతో నేతలు, కార్యకర్తలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్నందున.. మేయర్, ఛైర్పర్సన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఎక్స్అఫీషియో ఓటు వినియోగంపై వారితో చర్చిస్తున్నారు.