ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB Sub Committee Visit: జూరాల, నెట్టెంపాడును పరిశీలించిన కేఆర్​ఎంబీ సబ్​ కమిటీ.. - కేఆర్​ఎంబీ సబ్​ కమిటీ

KRMB Sub Committee Visit: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం తెలంగాణలో పర్యటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా జూరాల ప్రాజెక్టుతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్టులకు వస్తోన్న ఇన్ ఫ్లో, బయటకు వెళ్తున్న నీరు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి వినియోగం వివరాలను తెలుసుకున్నారు.

KRMB
KRMB

By

Published : Jan 27, 2022, 10:10 PM IST

KRMB Sub Committee Visit: రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా జూరాల ప్రాజెక్టుతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం పరిశీలించింది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, కేఆర్ఎంబీ ఎస్​ఈ అశోక్ కుమార్ సహా తెలంగాణ ప్రాజెక్టు అధికారులు సీఈ రఘునందన్, ఎస్​ఈలు శ్రీనివాసరావు, సత్యశిల సహా పలువురు పర్యటనలో పాల్గొన్నారు.

జూరాలలో ఏర్పాటు చేసిన టెలిమెట్రి స్టేషన్​ను ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తున్న నీటి లెక్కలు, టెలిమెట్రి స్టేషన్​లో సరిగ్గా నమోదవుతున్నాయా.. లేదా..? అడిగి తెలుసుకున్నారు. పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గతోందా.? లీకేజీ సమస్యలు, డ్యాం భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. డ్యాంకు వస్తున్న ఇన్ ఫ్లో, బయటకు వెళ్తున్న నీరు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి వినియోగం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నెట్టెంపాడు మొదటి లిఫ్ట్​ను ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. లిఫ్ట్ నుంచి ఎలాంటి డిశ్చార్జ్ లేకపోయినా టెలిమెట్రి యంత్రాల్లో నమోదవుతోందని బోర్డు సభ్యుల దృష్టికి తీసుకురాగా.. సరిచేస్తామని చెప్పనట్లు అధికారులు వెల్లడించారు.

రేపు ఆర్టీఎస్, తుమ్మిల్ల, ఎత్తిపోతల పథకాలను సైతం బోర్డు సభ్యులు పరిశీలించనున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి తుమ్మిళ్ల ఎత్తిపోతలను తీసుకొచ్చేలా గెజిట్ నోటిఫికేషన్​లో పొందుపరిచారు. ఆర్డీఎస్ నుంచి దశాబ్దాలుగా రాష్ట్రానికి దక్కాల్సిన నీటివాటా రావడం లేదని, ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టినట్లు తెలంగాణ చెబుతోంది. ఆర్డీఎస్, సుంకేశుల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పరిశీలించాలని కేఆర్ఎంబీ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలోని ఉపసంఘం రేపు ఈ ప్రాజెక్టులను పరిశీలించనుంది. బోర్డు ప్రతినిధులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు కూడా బృందంలో ఉంటారు.

ఇదీ చూడండి: RIVER BOARDS MEETING: నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details