ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB and GRMB: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు సిద్ధమవుతున్న బోర్డులు

ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సిద్దమవుతున్నాయి. కృష్ణాపై శ్రీశైలం ఎగువన, దిగువనున్న ప్రాజెక్టుల నిర్వహణ కోసం సీడబ్లూసీ అధికారులకు పని విభజన చేశారు. గోదావరి బోర్డు కోసం మరో చీఫ్ ఇంజనీర్​ను నియమించారు. గోదావరి బోర్డు సోమవారం, కృష్ణా బోర్డు మంగళవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నాయి.

krmb
krmb

By

Published : Oct 9, 2021, 9:25 AM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ప్రాజెక్టుల నిర్వహణను చేపట్టేందుకు సిద్దమవుతున్నాయి. గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రకటించిన మేరకు అన్ని ప్రాజెక్టులు కాకపోయినా ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా రెండు బోర్డులు కసరత్తు వేగవంతం చేశాయి. గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాలు ఆదివారం సమావేశం కానున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి ఇంకా రావాల్సిన సమాచారం, వివరాలపై ఉపసంఘాల సమావేశంలో చర్చిస్తారు. నోటిఫికేషన్ అమలు విషయమై చర్చించేందుకు గోదావరి బోర్డు సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ విషయమై జీఆర్​ఎంబీ సమావేశంలో చర్చించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు బోర్డుకు అప్పగించే విధివిధానాలపై సమావేశంలో చర్చిస్తారు.

కృష్ణాబోర్డు మంగళవారం ప్రత్యేక సమావేశాన్నిఏర్పాటు చేయనుంది. గెజిట్ నోటిఫికేషన్‌లోని ప్రాజెక్టుల నిర్వహణ విషయమై కేఆర్​ఎంబీ సమావేశంలో చర్చిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం గోదావరి బోర్డుకు కేంద్ర జలసంఘం మరో చీఫ్ ఇంజనీర్‌ను కేటాయించింది. భువనేశ్వర్‌లోని సీఈ అతుల్‌కుమార్ నాయక్‌ను నెల రోజుల కోసం జీఆర్​ఎంబీకి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఇప్పటికే కేటాయించిన సీడబ్లూసీ అధికారులకు కృష్ణా బోర్డు పనివిభజన చేసింది. శ్రీశైలంతో పాటు ఎగువనున్న పనులకు ఒక బృందాన్ని, శ్రీశైలం దిగువనున్న పనులకు మరొక బృందాన్ని చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో ఏర్పాటు చేశారు. శ్రీశైలం, ఎగువనున్న పనులకు సీఈ శివరాజన్ నేతృత్వం వహిస్తారు. శ్రీశైలం దిగువన పనులకు మరో సీఈ అనుపమ్ ప్రసాద్ నేతృత్వం వహిస్తారు.

ఇదీ చూడండి:

ENC Letter : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ

ABOUT THE AUTHOR

...view details