కృష్ణా ట్రైబ్యునల్ అంశంపై దాఖలైన పిటిషన్లపై.. డిసెంబర్ 13 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ట్రైబ్యునల్ ఉత్తర్వులు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల వంటి అంశాలపై దాఖలైన వ్యాజ్యాలను.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Krishna Tribunal Hearing in SC : '48 గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి'
కృష్ణా ట్రైబ్యునల్ ఉత్తర్వులు, గెజిట్ నోటిఫికేషన్ విడుదలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ (Krishna Tribunal Hearing in SC ) జరగనుంది. డిసెంబర్ 13 నుంచి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేయనుంది. ఇందులో భాగంగా.. 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Krishna Tribunal Hearing in SC
ఈ నేపథ్యంలో.. కృష్ణా ట్రైబ్యునల్ అంశంపై వాదనలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం 4 రాష్ట్రాలను ఆదేశించింది. 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణకు 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: