కృష్ణా జలాల్లో నీటి పంపకాలకు సంబంధించిన విచారణ కృష్ణా ట్రైబ్యునల్‌లో వాయిదా పడింది. నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ తరఫు సాక్షిని ట్రైబ్యునల్‌లో బుధవారం విచారణ చేయాల్సి ఉంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ సభ్యులతో చర్చించి విచారణ వాయిదా వేశారు.
కృష్ణా ట్రైబ్యునల్ విచారణ వాయిదా - కృష్ణా ట్రైబ్యునల్ న్యూస్
కృష్ణా జలాల నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ వాయిదా పడింది. కరోనా కారణంగా విచారణను వాయిదా వేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు ట్రైబ్యునల్‌ను కోరాయి.
కృష్ణా ట్రైబ్యునల్