విశాఖలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం పర్యటన - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం తాజా న్యూస్
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం విశాఖలో పర్యటిస్తోంది. బోర్డు ప్రధాన కార్యాలయం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలను పరిశీలించి.. నివేదిక రూపొందించి కేంద్ర జలవనరుల శాఖకు సమర్పిస్తుంది.
ప్రధాన కార్యాలయ భవనాలను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం విశాఖలో పర్యటిస్తోంది. మూడు రోజుల పాటు పర్యటించనున్న బృందం.. బోర్డు ప్రధాన కార్యాలయం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలను పరిశీలించి, నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు అందించనుంది. ఈ బృందంలో హరికేష్ మీనా, సభ్య కార్యదర్శి రాయిపురే, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్ సభ్యులుగా ఉన్నారు. గతంలోనూ.. వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలను బోర్డు తరపున ఇంజనీర్లు పరిశీలించారు. వాటికి సంబంధించిన నివేదికను బోర్డుకు అందించారు.