ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

KRMB Meeting: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరగనుంది. వర్చువల్ విధానంలోనే కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరగనుంది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

By

Published : Mar 9, 2022, 7:28 PM IST

KRMB Meeting: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరగనుంది. వర్చువల్ విధానంలో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరగనుంది.

ఆ నీటిని వినియోగించుకోవద్దు..
నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్​ఎంబీ గత నెలలో సూచించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది.

809 అడుగుల పైన ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 34 టీఎంసీల నీరు ఉందని.. కనిష్ఠ వినియోగ మట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 5.2 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. కానీ, మే నెల వరకు తాగునీటి అవసరాల కోసం 3.5 టీఎంసీలు కావాలని తెలంగాణ, 6 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులు పంపినట్లు కేఆర్ఎంబీ పేర్కొంది.

ఇదీచూడండి:ONGC: ఓఎన్‌జీసీకి.. "బాహుబలి" రిగ్‌

ABOUT THE AUTHOR

...view details