ఈ నెల 5న కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధలో జరిగే సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శితోపాటు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు పాల్గొనున్నారు. మే నెల వరకు తాగు, సాగు నీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. వాటిపై చర్చించి, నీటి కేటాయింపులు చేయనున్నారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాశారు.
ఈనెల 5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ - krishna river management board news
తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులపై చర్చించేందుకు... కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఈ శుక్రవారం సమావేశం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు బోర్డు సభ్య కార్యదర్శి లేఖలు రాశారు.
krishna river management board