ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB Meeting: నేడు కేఆర్ఎంబీ కమిటీ సమావేశం.. తెలుగు రాష్ట్రాల అవసరాలపై చర్చ - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

KRMB Meeting: తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకు నీటి విడుదల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని.. ఇరు రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నీటిపై నిర్ణయం తీసుకుంటారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది.

KRMB
KRMB

By

Published : Dec 9, 2021, 9:35 AM IST

KRMB Meeting: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలకు నీటి విడుదల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ ఇవాళ సమావేశం కానుంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్​సీ మురళీధర్, ఏపీ ఈఎన్​సీ నారాయణరెడ్డి భేటీలో పాల్గొంటారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకు వినియోగించుకున్న జలాల వివరాలను సమీక్షిస్తారు.

ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది.

ఇదీ చదవండి:

Saiteja no more: బిపిన్ రావత్‌ను మెప్పించిన తెలుగు'తేజం'

ABOUT THE AUTHOR

...view details