ఆమోదం, అనుమతి లేని ప్రాజెక్టుల పనులు కొనసాగించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు రాయిపురే... తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలసంఘం, బోర్డు ఆమోదం, అత్యున్నత మండలి అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని గతంలో స్పష్టం చేశామని లేఖలో పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లు ఇంకా అందాల్సి ఉందని తెలిపారు.
అనుమతి లేని ప్రాజెక్టు పనులు తెలంగాణ కొనసాగించవద్దు: కృష్ణా బోర్డు - తెలంగాణ వార్తలు
తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సీడబ్ల్యూసీ అనుమతి లేని ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని పేర్కొంది. బోర్డు ఆమోదం లేని ప్రాజెక్టుల పనులు కొనసాగించవద్దని.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
డీపీఆర్లు ఆమోదం పొంది ప్రాజెక్టులకు అనుమతి వచ్చే వరకు ఆయా ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు విజ్ఞప్తి చేసింది. అనుమతి లేకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపట్టిందంటూ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదు ప్రతిని కూడా లేఖతో జతపరిచారు. అనుమతి లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ ప్రాజెక్టులను తెలంగాణ చేపట్టిందన్న ఏపీ... కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల వల్ల తమకు నష్టం జరుగుతుందని తెలిపింది.
ఇదీ చదవండి :రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోంది: స్పీకర్ తమ్మినేని