రెండు తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం 110.4 టీఎంసీల నీటి లభ్యత ఉందని బోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు తెలంగాణకు 37.672 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17టీఎంసీల విడుదలకు బోర్డు అనుమతించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాలు కేటాయింపు - తెలుగు రాష్ట్రాలకు జల కేటాయింపులు వార్తల
krishna-river-management-board-
18:28 August 05
ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం జలాల విడుదలకు అనుమతిచ్చిన బోర్డు... శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, చెన్నై తాగునీటి సరఫరాకు తొమ్మిది టీఎంసీలు విడుదల చేయాలని తెలిపింది. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఎనిమిది టీఎంసీల విడుదలకు అనుమతించింది. గత నీటి సంవత్సరంలో మిగిలిన తమ వాటాను ఈ ఏడాదికి బదలాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తికి ఏపీ అంగీకరించలేదని... ఈ అంశంపై త్రిసభ్య కమిటీ ప్రత్యేక సమావేశంలో చర్చించాలని బోర్డు లేఖలో తెలిపింది.
ఇదీ చదవండి
Last Updated : Aug 5, 2020, 7:52 PM IST