ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు - కృష్ణానదీ యాజమాన్య బోర్డు తాజా సమాచారం

రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులను చేపట్టవద్దని కృష్ణానదీ యాజమాన్య బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు ఏపీకి లేఖ రాసింది.

Krishna river Board
రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు

By

Published : Jan 26, 2021, 3:37 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులను నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కోరింది. ఎన్జీటీ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ఈఎన్సీ డిసెంబర్ 19న బోర్డుకు లేఖ రాశారు. దీని ఆధారంగా ఏపీ ఈఎన్సీకి బోర్డు సభ్యకార్యదర్శి హరికేశ్ మీనా లేఖ పంపారు. ఆమోదం లేని ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని . గతంలోనే స్పష్టం చేశామని అన్నారు. అయినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు కొనసాగిస్తున్నారని తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్​లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలించకుండా... ప్రాజెక్టులకు అత్యున్నత మండలి ఆమోదం లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని కోరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details