కృష్ణా బోర్డు సమావేశంలో రాష్ట్ర వాదనను సమర్ధంగా వినిపించినట్లు జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. తాగునీటి కేటాయింపులను 20శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణాకు మళ్లింపుపైనా బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. తెలంగాణాకు అదనపు జలాలు ఇవ్వాలని కోరామన్నారు.
'ఏపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ' - krishna board meeting updates
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. బోర్డు ఎదుట ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు వాదనలు వినిపించారు.
ముగిసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
రెండు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలిమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చించారు. పోతిరెడ్డిపాడు కాల్వ సామర్థ్యాన్ని పెంచాలన్న ఏపీ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్రం ఫిర్యాదు చేసింది. ఏపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.