విజయ పాల ధరలు పెంచినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల సేకరణ ధరలు, రవాణా, ప్యాకింగ్ సామగ్రి తదితర ఖర్చులు పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని వివరించారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. పాల పదార్థాల ధరలూ స్వల్పంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ధరలు మే ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. నెలవారీ పాల కార్డులు కొనుగోలు చేసిన వారికి మే 9వ తేదీ వరకు పాత ధరలు వర్తిస్తాయన్నారు.
విజయ పాల ధరల పెంపు - విజయ పాల ధరలు తాజా వార్తలు
విజయ పాల ధరలను పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు వెల్లడించారు.
విజయ పాల ధరల పెంపు
TAGGED:
విజయ పాల ధరలు తాజా వార్తలు