ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టిక్కెట్ ఉంటేనే దర్శనానికి అనుమతి: కలెక్టర్ ఇంతియాజ్ - ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల వార్తలు

ఇంద్రకీలాద్రి నవరాత్రి మహోత్సవాల నిర్వహణపై కృష్ణా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులు దర్శనం టిక్కెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు, ప్రత్యేక దర్శనాలు, పార్కింగ్ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

krishna district collector
krishna district collector

By

Published : Oct 9, 2020, 9:21 PM IST

దసరా నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌ దర్శనం టిక్కెట్‌ ఉంటేనే అనుమతిస్తామని కృష్ణా జిల్లా కలెక్టరు ఏఎండీ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు. కలెక్టరు క్యాంపు కార్యాలయంలో దసరా మహోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏవిధంగా నడచుకోవాలో దిశానిర్దేశం చేశారు.

టిక్కెట్లు ఉంటేనే దర్శనం...

ఆన్‌లైన్‌ దర్శనం టిక్కెట్లు పొందిన వారికి మాత్రమే ఆలయ దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎక్కువ మంది భక్తులు నవరాత్రి సమయంలో దుర్గగుడికి సంప్రదాయంగా వస్తుంటారని... వారు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత దర్శనానికి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు.

60వేలకు పైగా అనుమతులు....

ఆన్‌లైన్‌ టిక్కెట్ల నమోదు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 60,372 మంది భక్తులు ఆన్‌లైన్‌ అనుమతి పొందారని చెప్పారు. నవరాత్రుల్లో ప్రతిరోజు కేవలం పది వేల మంది భక్తులకే దర్శనం దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఉచిత దర్శనానికి 29,710 టిక్కెట్లు, 100 రూపాయల దర్శనం టిక్కెట్లు 19,273... 300 రూపాయల టిక్కెట్‌కు 11,389 మంది భక్తులు ఉన్నారన్నారు.

కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..

దర్శన సమయంలో గుడికి వచ్చే భక్తులను తప్పనిసరిగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తారన్నారు. ఆలయ అర్చకులకు, సిబ్బందికి ర్యాపిడ్‌ టెస్టులు కూడా చేయిస్తామన్నారు. అనుమానిత లక్షణాలున్న రోగులను వెంటనే ఐసొలేషన్‌ చేస్తామని వెల్లడించారు. అంబులెన్స్‌ ద్వారా వారిని సమీపంలోని నిమ్రా లేదా జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలిస్తామని కలెక్టరు ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి..

ఆలయాన్ని దర్శించే వీఐపీ భక్తుల కోసం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు... మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు ప్రత్యేక దర్శనానికి సమయం కేటాయించినట్లు చెప్పారు. ఈ సమయాల్లోనే ప్రముఖులు దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. కొండపైకి అర్చకులు, సిబ్బంది తీసుకొచ్చే ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తామని- దీని కోసం పాస్‌లు జారీ చేస్తామన్నారు.

ఇదీ చదవండి

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details