ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Krishna Board Meet: నేడు కృష్ణా బోర్డు కమిటీ సమావేశం

Krishna Board Committee Meet : ఇవాళ కృష్ణా బోర్డు జలాశయాల నిర్వహణ కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధలో కమిటీ రెండోసారి భేటీ నిర్వహించనుంది. అయితే మొదటి సమావేశానికి హాజరుకాని తెలంగాణ అధికారులు ఇవాళ కూడా హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదన్న అనుమానం వ్యక్తమవుతోంది.

Krishna Board Committee Meet
కృష్ణా బోర్డు సమావేశం

By

Published : May 30, 2022, 11:24 AM IST

Krishna Board Committee Meet : జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన, వరదనీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది. ఇటీవలి కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయానికి అనుగుణంగా బోర్డు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్లై, కన్వీనర్​గా ఉన్న కమిటీలో బోర్డు సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్​కో అధికారులు వెంకటరాజం, సృజయ కుమార్ ఉన్నారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్​లో విద్యుత్ ఉత్పత్తి కోసం 15 రోజుల్లోగా రూల్ కర్వ్స్​ ముసాయిదాపై పరిశీలన, వరదజలాల లెక్కింపు అంశాలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బోర్డు పేర్కొంది. అందుకు అనుగుణంగా కమిటీ తొలి సమావేశం ఈ నెల 20వ తేదీన నిర్వహించింది. అయితే ఆ సమావేశానికి తెలంగాణ అధికారులెవ్వరూ హాజరు కాలేదు. తాము ప్రీ మాన్సూన్ తనిఖీల్లో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేమని.. జూన్ 15వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని అప్పట్లో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు.

తాజాగా కమిటీ రెండో సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జలసౌధలో సోమవారం ఉదయం సమావేశం జరగనుంది. అయితే జూన్ 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని గతంలోనే కోరిన నేపథ్యంలో తెలంగాణ అధికారులు ఇవాళ కూడా హాజరవుతారా లేదా అన్నది చూడాలి. నేటి సమావేశానికి తెలంగాణ అధికారుల హాజరుపై అనుమానం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details