ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం - నేడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

నిన్న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేటికి వాయిదా పడింది. హైదరాబాద్​లోని జలసౌధ వేదికగా బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

krishna-board-meeting-at-hyderabad
krishna-board-meeting-at-hyderabad

By

Published : Jan 9, 2020, 10:48 AM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేడు జరగనుంది. నిన్న జరగాల్సిన భేటి వాయిదా పడింది. బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు, బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పాల్గొంటారు. కేంద్ర జల్​శక్తి మంత్రిత్వశాఖ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. బోర్డు ప్రధాన కార్యాలయం తరలింపు, జలాల సరిహద్దులతో పాటు ప్రధానంగా 4 అంశాలను చర్చింనున్నట్లు తెలుస్తోంది.


ఈ సమావేశంలో ప్రధానమైన 4 అంశాలతో పాటు కొత్తగా మరో రెండు విషయాలను ఇరు రాష్ట్రాలు లేవనెత్తే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చెన్నైకి తాగునీటి విడుదల అంశాన్ని కూడా బోర్డు పరిధిలో చేర్చాలని చర్చించే అవకాశం ఉంది. వరదల సమయంలో తెలంగాణ వినియోగించుకుంటున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని... ఏపీ బోర్డు ఛైర్మన్​ అనుమతితో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అజెండాలో చేర్చిన కేఆర్​ఎంబీకి నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీ, 10వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తీర్మానం గురించి చర్చించనున్నట్టు సమాచారం. బోర్డును ఏపీ రాజధానికి తరలింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details