ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB, GRMB Meeting: నేడే యాజమాన్య బోర్డుల భేటీ.. తెలంగాణ గైర్హాజరు! - కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశానికి తెలంగాణ గైర్హజరయ్యే అవకాశం

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు అంశాలే ఎజెండాగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఇవాళ సమావేశం కానున్నాయి. రెండు బోర్దుల ఉమ్మడి భేటీలో బోర్డు ప్రతినిధులతో పాటు AP సభ్యులు పాల్గొననున్నారు. కేసుల విచారణ నేపథ్యంలో ఇవాళ్టి భేటీకి హాజరు కావడం కుదరదన్న తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యే అవకాశం ఉంది.

krishna-and-godavari
krishna-and-godavari

By

Published : Aug 9, 2021, 8:14 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా, గోదావరి నదులపై (Krishna and Godavari rivers) ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేంద్రం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) అమలు కార్యాచరణ ఎజెండాగా ఇవాళ కీలక సమావేశం (KRMB, GRMB Meeting) జరగనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అత్యవసర సమావేశం (Krishna and Godavari river boards meet ) జరగనుంది.

హాజరయ్యే అవకాశం తక్కువే..!

కేఆర్​ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్, జీఆర్​ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో రెండు బోర్డుల సభ్య కార్యదర్శులు, సభ్యులు, రెండు రాష్ట్రాల తరపున పాలనా, సాంకేతిక సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. అయితే సమావేశానికి తెలంగాణ సభ్యులు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇవాళ సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున బోర్డు భేటీకి హాజరు కావడం కుదరదని తెలంగాణ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం, బోర్డుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి.

సమన్వయ కమిటీ సమవేశంలో సైతం..

కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల ప్రకారం నిర్దిష్ట గడువులోగా కార్యాచరణ ఖరారు చేసి అమలు చేయాల్సి ఉందని, సమయాభావం వల్ల అత్యవసర సమావేశాన్ని కొనసాగిస్తున్నట్లు రెండు బోర్డులు స్పష్టం చేశాయి. నిన్న కూడా కృష్ణా, గోదావరి బోర్డులకు (Krishna and Godavari boards) మరోమారు లేఖలు రాసిన తెలంగాణ... ఇవాళ్టి భేటీకి హాజరు కాలేమని ఇప్పటికే చెప్పినందున సమావేశానికి మరో తేదీని సూచించాలని కోరింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సభ్యులు బోర్డుల ఉమ్మడి సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల జరిగిన బోర్డుల సమన్వయ కమిటీల సమావేశం సైతం తెలంగాణ సభ్యుల గైర్హాజరీలో జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ విషయమై ఇవాళ్టి భేటీలో చర్చించనున్న బోర్డులు... నిర్దిష్ట గడువుల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన సమాచారం అందించాలని కోరనున్నాయి. రెండు బోర్డులకు రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీ, రికార్డులు, కార్యాలయాల స్వాధీనం సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

ఏపీ ఏం సమాధానం చెప్పనుంది..!

గెజిట్ నోటిఫికేషన్ లోని కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో వివరాలు ఇవ్వలేమని సమన్వయ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలిపింది. దీంతో ఇవాళ్టి భేటీలో ఏపీ ఏం సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు తెలంగాణ ప్రభుత్వం రెండు బోర్డులకు ఇవాళ మరో లేఖ రాసే అవకాశం ఉంది. బోర్డుల భేటీకి ఇంకో తేదీ చెప్పాలని కోరడంతో పాటు సమావేశాల్లో చర్చించేందుకు జలాల వినియోగం సహా ఇతర అంశాలను ఎజెండాలో చేర్చాలని కోరనుంది.

ఇదీ చదవండి:

జాతీయోద్యమంలో ఆఖరి సమ్మెట క్విట్‌ ఇండియా

ABOUT THE AUTHOR

...view details