ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రైతుల కాళ్లు కడిగిన ఆధ్యాత్మికవేత్త జ్యోతిర్మయి - ap capital issue news

ప్రముఖ ఆధ్యాత్మిక గాయని, ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి.. తుళ్లూరులో మహాధర్నా చేస్తున్న రైతులను కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఓ రైతు దంపతుల కాళ్లు కడిగారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి రైతులు త్వరలోనే బయటపడతారని ధైర్యం చెప్పారు. ప్రవచనాలతో రైతులు, మహిళల్లో స్థైర్యాన్ని నింపారు.

kondaveeti jyothirmayye
ఆధ్యాత్మికవేత్త జ్యోతిర్మయి

By

Published : Jan 15, 2020, 6:26 PM IST

రాజధాని రైతులకు మద్దతు తెలిపిన ఆధ్యాత్మికవేత్త జ్యోతిర్మయి

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి రాజధాని రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు పలికారు. సంఘీభావంగా దీక్షా శిబిరంలో కాసేపు కుర్చున్నారు. అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. కృష్ణదేవరాయలవంటి ఎంతో మంది సుప్రసిద్ధులు నడయాడిన అమరావతి ప్రాంతానికి చరిత్రలో ప్రముఖ స్థానం ఉందన్నారు. అటువంటి పేరుతో రాజధానిని ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తుళ్లూరు మహాధర్నాలో పాల్గొని... రైతు దంపతులకు కాళ్లు కడిగి నమస్కరించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details