ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజకీయ నేతగా రాలేదు... ఈటలకు ధైర్యం చెప్పేందుకు వచ్చా'

మాజీ మంత్రి ఈటల రాజేందర్​తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు నేతలు భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే కొండా కూడా కాంగ్రెస్​కు రాజీనామా చేయటం... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలను కలవటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

KONDA VISHWESHWAR REDDY MET ETELA RAJENDER
KONDA VISHWESHWAR REDDY MET ETELA RAJENDER

By

Published : May 7, 2021, 7:56 AM IST

మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వరరెడ్డి

రాజకీయంగా జరిగిన విషయాలను అవమానంగా భావించొద్దని చెప్పేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్​ను కలిసినట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ను... మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కలవటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ మేడ్చల్​ జిల్లా శామీర్​పేటలోని ఈటల నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఓ మిత్రునిగా.. కలిసి మాట్లాడేందుకు వచ్చినట్లు కొండా తెలిపారు. రాజకీయాలు చర్చించేందుకు రాలేదని స్పష్టం చేశారు. ఈటల భార్య జమునా రెడ్డి తనకు బంధువన్నారు.

కేసీఆర్​ తప్పుల్లో ఇదొకటి...

ఏ నిర్ణయం తీసుకున్నా... తెలంగాణ ప్రజలు వెన్నంటే ఉంటారని ఈటలతో చెప్పినట్టు కొండా తెలిపారు. ఇతర విషయాలు ఏమీ మాట్లాడలేదని... రాజకీయాలు అసలు చర్చకే రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని... అందులో ఇదొకటని వివరించారు. దీన్ని అవమానంగా భావించొద్దని... ఈ చర్య వల్ల మంచే జరిగిందని ధైర్యం చెప్పినట్టు పేర్కొన్నారు.

సర్వత్రా ఆసక్తి...

గత పది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. ఇరువురు నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే అంశం ఆ నేతల అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇదీ చూడండి: పోలవరంతో తెలంగాణలో ముంపు ఉండదు.. ఏపీ స్పష్టీకరణ

ABOUT THE AUTHOR

...view details