తెలంగాణలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే భాజపా చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని కొండా ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకుంటే అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందన్నారు. రాష్ట్రంలో 75 శాతం ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయింది. భాజపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నా. నేను రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండేవాడ్ని. భాజపా పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ. తాను పదవులు ఆశించి భాజపాలోకి వెళ్లడం లేదు.
- కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ