Kona Raghupathi resign: శాసన సభ ఉప సభాపతి పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. ఆయన రాజీనామాను ఆమోదించి తదుపరి ఉప సభాపతి ఎన్నిక కోసం ఇవాళ(శుక్రవారం) శాసన సభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేసింది. శాసన సభా ఉపసభాపతిగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిని వైకాపా పోటీలో నిలపాలని నిర్ణయించింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్లకు ఉప సభాపతి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం ఉప సభాపతి ఎన్నిక జరగనుంది. సంఖ్యాబలం ఉన్న కారణంగా ఉప సభాపతిగా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నిక లాంఛనం కానున్నట్లు తెలుస్తోంది.
Kona Raghupathi resign: ఉపసభాపతి పదవికి కోన రఘుపతి రాజీనామా - కోలగట్లకు ఉప సభాపతి పదవి
Kona Raghupathi resign: ఏపీ ఉపసభాపతి పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. కొత్త ఉపసభాపతి ఎన్నిక సోమవారం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉపసభాపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వైకాపా నేత కోలగట్ల వీరభద్రస్వామి ఉపసభాపతి పదవికి నామినేషన్ వేయనున్నారు.

కోన రఘుపతి రాజీనామా
Last Updated : Sep 16, 2022, 12:56 PM IST