ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త బ్రాండ్లతో జగన్.. మద్యం మాఫియాకు తెరతీశారు: కొల్లు రవీంద్ర

అధికారంలోకి వస్తే మద్యపాన నిషధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని.. కానీ ఆయనే తన సొంత బ్రాండ్లతో మద్యం మాఫియాకు తెరతీశారని తెదేపా నేత పొలిట్​బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. వైకాపా నేతలే దగ్గరుండి బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

kollu
kollu

By

Published : Jun 9, 2021, 12:48 PM IST

అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న వైకాపా నేతలు దగ్గరుండి బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. "జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లతో మద్యం మాఫియాకు తెరతీశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై లిక్కర్ మాఫియా ద్వారా కోట్లు దండుకుంటూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. విశాఖ మద్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి అసలు దోషులను కఠినంగా శిక్షించాలి. కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సమయం ఇవ్వకపోవటం సిగ్గుచేటు. రెండేళ్లలో దోచుకోవటమే పనిగా వైకాపా పాలన సాగింది. కమీషన్ల కోసం ఇసుక రీచ్​లను ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేశారు. ఇసుక మాఫియా వల్ల వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోగా అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు" అని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details