ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగని కో'ఢీ' పందేలు...చేతులు మారిన కోట్ల రూపాయలు! - kodipandelu conduct in various places in AP news

సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఔత్సాహికులు...ఉత్సాహంగా పందేలు కాయగా.. కోట్లరూపాయలు చేతులు మారాయి. కోడిపందెం బరుల పక్కనే... పేకాట, గుండాట జోరుగా సాగింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్థరాత్రి వరకూ సాగిన జూదాలు చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కొన్ని ప్రాంతాలు... ఏకంగా జాతరను తలపించాయి.

kodipandelu-conduct-in-various-places-in-ap
kodipandelu-conduct-in-various-places-in-ap

By

Published : Jan 16, 2020, 4:40 AM IST

Updated : Jan 16, 2020, 4:46 AM IST

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి నాడు కోడిపందేలను జోరుగా నిర్వహించారు. పండక్కి సొంతూరు వచ్చే వారంతా... పోటీలకు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వందల బరులు ఏర్పాటు చేసి కోడిపందేల నిర్వహించారు. బరులన్నీ జనాలతో కిటకిటలాడాయి. దెందులూరులో కోడి పందేలుతో పాటు పేకాట జోరుగా సాగింది. శ్రీరామవరం, కొండలరావుపాలెం, పాతపెదపాడులో భారీఎత్తున పందేలు నిర్వహించారు.వీటిని తిలకించేందుకు తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో తరలివచ్చారు.
పందెంరాయుళ్లకు కాసులపంట
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కోడిపందేలు, గుండాట జోరుగా సాగింది. డీఎస్ పాలెం, ఉడిమూడి, పోతవరం, నాగుల్లంక, మానేపల్లి, వాడ్రేవుపల్లి, జి.అగ్రహారం, చింతలంకలో అడ్డూ-అదుపూ లేకుండా పందేలు నిర్వహించారు. బరిలో కోడిపుంజులు... వీరోచితంగా పోరాడుతూ.. పందెంరాయుళ్లకు కాసులు కురిపించాయి. గుండాటలోనూ స్థానికులు అదే రీతిలో పాల్గొన్నారు.

ఆగని కో'ఢీ' పందేలు...చేతులు మారిన కోట్ల రూపాయలు!
బహుమతులుగా బైకులు,బుల్లెట్లుకృష్ణాజిల్లాలోనూ ఈసారి కోడిపందేలు జోరుగానే సాగాయి. గ్రామశివార్లలో పొలాల్లోని టెంట్లు వేసి మరీ పందేలు నిర్వహించారు. పెదపులిపాక, ఈడ్పుగల్లు ప్రాంతాలు జాతరను తరలించాయి. అంపాపురం వద్ద ప్రత్యేకంగా పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు వీటితో పాటు పొట్టేళ్ల పందేళ్లకు జనాలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి వచ్చిన వారితో బరులు ఉన్న ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. వచ్చే వారంతా కూర్చుని పోటీలు తిలకించేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీల్లో గెలుపొందిన కోళ్ల యజమానులకు.. బైక్‌, బుల్లెట్లను బహుమతులుగా ఇచ్చారు.

జగ్గయ్యపేట ప్రాంతంలో కోడిపందాలు జోరుగా సాగాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణా నుండి కూడా పందెం రాయుళ్లు తరలివచ్చారు. చిల్లకలు, షేర్ మహ్మద్ పేట, అనుమంచి పల్లి గ్రామాలతో పాటు జగ్గయ్యపేట శివార్లు, వేదాద్రి, బూదవాడ గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాలతో పాటు పెద్ద మొత్తంలో జాద క్రీడలు కూడా సాగాయి. బారుల వద్దకు తరలివచ్చిన పందెం రాయుళ్ల వాహనాలతో ప్రాంగణాలు కోలాహలంగా మారాయి.

ఇదీ చదవండి : 'పేదలను పండగ పూట పస్తులు ఉంచడమే నవశకమా?'

Last Updated : Jan 16, 2020, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details