ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గన్నవరం విమానాశ్రయానికి.. కోడెల తనయుడు - కోడెల

కోడెల శివప్రసాద్ తయనుడు డాక్టర్​ శివరాం.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కెన్యా వెళ్లిన ఆయన... తండ్రి మరణ వార్త వినగానే బయలుదేరి విజయవాడకు వచ్చారు. ముందుగా గుంటూరు వెళ్లి.. తండ్రి భౌతికకాయంతో పాటుగా నరసరావుపేటకు చేరుకుంటారని అతని అనుచరులు చెప్పారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కోడెల తనయుడు

By

Published : Sep 17, 2019, 3:42 PM IST

శాసనసభ మాజీ సభాపతి డాక్టర్​ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్​ కోడెల శివరాం.. కెన్యా నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న తన తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే స్వస్థలానికి పయనమయ్యారు. ముందుగా.. ముంబాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వచ్చారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కోడెల తనయుడు

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్టు భవనం నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్దీవ దేహం వస్తుండడంతో గన్నవరం నుంచి శివరాం వెళ్లారు. కోడెల భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం అదే వాహన శ్రేణితో కలిసి గుంటూరు అక్కడి నుంచి నరసరావుపేట వెళ్తారని శివరాం అనుచరులు పేర్కొన్నారు. తమ కుటుంబం బాధలో ఉందని ఈ పరిస్థితుల్లో తానేం మాట్లాడలేనంటూ గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులివ్వకుండా బయలుదేరారు.

ABOUT THE AUTHOR

...view details