దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని మంత్రి కొడాలి నాని పునరుద్ఘాటించారు. నిన్నటివరకు 38 లక్షల మందికి రేషన్ అందించామన్న నాని... అందరికీ బియ్యం అందిస్తామని, దుకాణాల వద్ద గుంపులుగా ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు ఎక్కడ, ఏ జిల్లాలో ఉన్నా రేషన్ అందిస్తామని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో ఉన్నవారికి వెయ్యి రూపాయిలు పంపిణీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
త్వరలో ఇంటింటికీ నిత్యావసరాలు: కొడాలి నాని
లబ్ధిదారులు అందరికీ నిత్యావసరాలు అందుతాయని మంత్రి కొడాలి నాని ఉద్ఘాటించారు. రేషన్ సరకులను త్వరలో ఇంటింటికీ పంపిణీ చేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ఎక్కువమంది రేషన్ దుకాణాలకు వచ్చారన్న నాని... రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు వద్దని సీఎం ఆదేశించినట్టు వివరించారు. ప్యాకేజింగ్ పద్ధతి అమల్లోకి రానందువల్లే స్టోర్స్ నుంచి రేషన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.
కొడాలి నాని