ప్రజా సంక్షేమ పాలనను అమలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేసి..1.31 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశారని తెలిపారు. కులం, మతం, రాజకీయాలు చూడకుండా ప్రతి వ్యక్తికి చిత్తశుద్దిగా సంక్షేమ ఫలాలు అందించారన్నారు.
కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలకు 10లక్షలు ఇవ్వాలనుకోవడం దేశానికే ఆదర్శమన్నారు. 75 ఏళ్ళలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ రెండేళ్లలో 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైకాపా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ఓర్వలేకే చంద్రబాబు, లోకేశ్‌లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చుతున్నారన్నారు.