సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్ర కుమార్.. నటుడు సోనూసూద్‌కు వీరాభిమాని. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సోనూ చేసిన సాయంపై కృతజ్ఞతతో ఏదైనా చేయాలనుకున్నారు. ఆయనను కలిసి తన అభిమానాన్ని తెలియజేయాలనుకున్నారు. అందుకే సోనూ చేసిన సామాజిక సేవపై స్వయంగా పాటలు రచించి పాడారు. ఆ పాటల సీడీని తీసుకుని హైదరాబాద్ నుంచి ముంబయికి కాలినడకన వెళ్లి రియల్ హీరోను కలిశారు.
అభిమాని గురించి తెలుసుకున్న సోనూసూద్.. ఇంద్రకుమార్‌తో మాట్లాడి పాటల సీడీని ఆవిష్కరించారు. సోనూపై రాసిన పాటను ఆ యువకుడితో పాడించారు. సోనూసూద్‌ని కలిసి ఇంద్రకుమార్ అభినందనలు పొందడం పట్ల.. కోమరబండ వాసులు హర్షం వ్యక్తం చేశారు.