ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 26, 2020, 4:07 PM IST

ETV Bharat / city

'వ్యవసాయ చట్టాలపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారు'

సాగు చట్టాల రద్దు కోసం అన్నదాతలు దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తుంటే.. ప్రధాని మోదీ ఆ చట్టాల గురించి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలోని రైతు సంఘాలతో కలిసి దేశ రాజధానికి వెళ్లి.. అక్కడ ఆందోళనలు చేస్తున్న కర్షకులకు రూ. 10 లక్షలు సాయం అందజేయనున్నట్లు తెలిపారు.

vadde sobhanadreeswara rao
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

నెలరోజులుగా దిల్లీలో రైతులు నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం వారి పట్ల కనీసం జాలి చూపడంలేదని.. కిసాన్ సంఘర్ష సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు ఆందోళనలు చేస్తుంటే.. ప్రధాని మోదీ వాటిపై అబద్ధాలు చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు.

రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల అధికారాలను కాలరాస్తూ.. ప్రధాని మోదీ నియంతలా పాలిస్తున్నారని శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. గతంలో రైతు ఉద్యమాల్లో భాజపా పాల్గొనగా.. ఇప్పుడు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనల్లో పాలుపంచుకోవడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు దిల్లీ వెళ్లి.. కర్షకులకు మద్దతు పలకబోతున్నాయన్నారు. తమవంతు సాయంగా అక్కడ అన్నదాతలకు రూ. 10 లక్షలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details