ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఎవరా నేరస్థుడు?" పోలీసుల వల్ల కాలేదు.. "దోమ" పట్టించింది! - crime news

"అదృష్టం అడ్డం తిరిగితే.. అరటి పండు తిన్నా.. పన్ను విరిగిపోద్ది" అన్నది ఓ సామెత. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే.. ఇదిగో.. ఈ స్టోరీలోని దొంగను చూపిస్తే చాలు! అవును.. ఓ అపార్ట్ మెంట్లో చోరీకి వెళ్లాడు. ఇళ్లంతా తిరిగేశాడు.. విలువైన వస్తువులన్నీ సర్దేసుకున్నాడు.. వంట గదిలోకెళ్లి మాంచి విందు భోజనం కుమ్మేశాడు.. సక్సెస్ ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేసుకొని.. దర్జాగా బయటపడ్డాడు. అలాంటి వాడిని.. 19 రోజుల తర్వాత ఓ దోమ పోలీసులకు పట్టించింది!!

mosquito
mosquito

By

Published : Sep 20, 2022, 7:59 PM IST

చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌.. ఓ రోజు రాత్రి.. నగరం నిద్రపోతున్న వేళ.. దొంగోడు మేల్కొన్నాడు. ముందుగానే రెక్కీ నిర్వహించిన ప్రకారం.. ఖరీదైన అపార్ట్ మెంట్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడో.. పైన చదువుకున్నారు కదా.. (మళ్లీ చెబితే విసుక్కునే అవకాశం ఉందని సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది.) ఇక, నేరుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం.

ఏదో పని మీద ఊరెళ్లిన ఇంటి యజమానులు.. చోరీ జరిగిన మర్నాడు వచ్చారు. ఇల్లు చూసుకున్నారు.. ఘొల్లుమన్నారు. పోలీస్టే స్టేషన్ లో ఫోన్ రింగ్ అయ్యింది.. కాసేపటి తర్వాత ఇంటిముందు పోలీస్ సైరన్ మోగింది. ఖాకీలతోపాటు ఓ కుక్కగారు కూడా రంగంలోకి దిగారు. కానీ.. దొంగ గారికి చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టుంది. ఇల్లు అంతా తిరిగి.. అన్నీ సర్దేశి.. చివరకు వంటింట్లో భోజనం చేసి కూడా.. ఎక్కడా సింగిల్ ఎవిడెన్స్ వదల్లేదు.

పోలీసులు ఇల్లు మొత్తం శోధించారు. వంటగదిలో తిని వదిలేసిన నూడుల్స్, కోడి గుడ్ల పొట్టు.. గెలికేసిన వంట సామాన్లు తప్ప.. ఇంకేమీ కనిపించలేదు. వార్డ్‌ రోబ్ లో సర్దిపెట్టిన దుప్పట్లు, దిండ్లు.. మంచం మీద చిందరవందరగా పడేసి ఉన్నాయి. దోమలు కుట్టాయో ఏమో.. మస్కిటో కాయిల్స్ కూడా వెలిగించాడు దొంగ. ఈ సీన్స్ చూసిన తర్వాత.. దొంగ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడనే విషయం అర్థమైంది పోలీసులకు. కానీ.. ఒక్క ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో.. కేసు విచారణ చాలా కష్టంగా మారింది.

అప్పుడు.. కనిపించింది ఒక దోమ. బతికి ఉన్నది కాదు.. చచ్చిపోయింది! ఆ దొంగను కుట్టేసి.. ఫుల్లుగా రక్తం పీల్చేసిన దోమను.. కసి తీరా గోడకు కొట్టాడు చోర్. తెల్లటి గోడపై నెత్తుటితో అతుక్కుపోయింది. "ఎంత పెద్ద నేరగాడైనా.. ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు" అనే డైలాగ్ ప్రతీ క్రైమ్ మూవీలో వింటూనే ఉంటాం కదా.. ఇది అలాంటిదే అన్నమాట! దోమను చంపడం అంత పెద్ద తప్పు అని ఆ దొంగకు అప్పుడు తెలియలేదు.

పోలీసులు వెంటనే క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు. జాగ్రత్తగా ఆ గోడమీది బ్లడ్ శాంపిల్ ను తీసుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 19 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. పోలీసులు తమ వద్ద ఉన్న క్రిమినల్స్ రికార్డ్స్ ఓపెన్ చేసి.. వాటితో పోల్చి చూశారు. ఒక్కడితో సరిగ్గా సరిపోతున్నాయి. అతగాడు నేరాల్లో ఆరితేరిన వాడు. వాడిని స్టేషన్ కు పిలిపించారు.

"పలానా రోజున.. పలానా ఇంట్లో దొంగతనం జరిగింది.. చేసింది నువ్వే కదా?" అన్నారు పోలీసులు. "ఇలాంటి ఎంక్వైరీలు ఎన్ని చూడలేదు.. పైగా నేను ఒక్క ఆధారం కూడా వదల్లేదు" అనుకున్నాడేమో.. "ఛస్.. నేను కానే కాదు. అయినా, ఎక్కడ చోరీ జరిగినా.. కారణం నేనేనా సార్? దిసీజ్ వెరీ దారుణం" అన్నాడు. మనోడి సింగిల్ టేక్ యాక్టింగ్ చూసిన తర్వాత.. సింపుల్ గా ల్యాబ్ రిపోర్ట్స్ ముందు పెట్టారు పోలీసులు.. "దోమ ఎంతపని చేశావే..?" అనుకుంటూ వెళ్లిపోయాడు.. కటకటాల వెనక్కి!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ABOUT THE AUTHOR

...view details