ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KGF WEAPON: ఇదో నయా ట్రెండ్​... హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా - CRIMINALS USING KGF WEAPONS

CRIMINALS USING KGF WEAPON:కేజీఎఫ్ సినిమా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జనాలను ఆకర్షించింది ఈ చిత్రం. అయితే అందరికి యశ్ యాక్టింగ్ నచ్చితే.. నేరస్థులకు మాత్రం యశ్ ఉపయోగించిన సుత్తి నచ్చిందనుకుంటా. అందుకే దాదాపు హత్యల్లో.. ఈ ఆయుధాన్నే ఎక్కువగా వాడుతున్నారు.

CRIMINALS USING KGF WEAPON
హత్యల్లోనూ 'కేజీఎఫ్' మేనియా

By

Published : May 14, 2022, 2:09 PM IST

CRIMINALS USING KGF WEAPON: తాజాగా.. హత్యలు, గొడవలు, దాడులకు నిందితులు ‘సుత్తి’ ఆయుధంగా ఉపయోగించటం చర్చనీయాంశంగా మారింది. మీర్‌పేట్‌ ప్రశాంత్‌హిల్స్‌లో శ్వేతారెడ్డి అనే మహిళ ప్రియుడు యశ్మకుమార్‌ను ఫేస్‌బుక్‌ స్నేహితుడు అశోక్‌తో హత్య చేయించటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితులు సుత్తితో యశ్మకుమార్‌ తల వెనుక భాగంలో పలుమార్లు గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ మరణించాడు.

నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ కొత్తగూడ వద్ద భార్య జ్యోతి, అతడి ప్రియుడు యశ్వంత్‌ను భర్త శ్రీనివాసరావు సుత్తి ఉపయోగించే హతమార్చాడు. వెండితెరపై కేజీఎఫ్‌ రెండు భాగాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలో కథానాయకుడు ప్రత్యర్థులను ఖతం చేసేందుకు సుత్తినే వాడతాడు. కొద్దికాలంగా హత్యలు, దాడులకు నిందితులు దీన్నే ఉపయోగించేందుకు సినిమా ప్రభావం కూడా కారణం కావచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details