Kesineni Nani: భోగాపురం ఎయిర్పోర్టుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేసి, తక్షణమే దాని నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తెదేపా ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం లోక్సభలో పౌర విమానయానశాఖ బడ్జెట్ పద్దులపై మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2,700ఎకరాల భూమిని సేకరించారు. కేవలం 35ఎకరాలే స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.
గతంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతిరావు ఉన్నప్పుడు దీనికి భూమిని కేటాయించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు భూమిని స్వాధీనం చేయడానికి ఎన్ఓసీ తీసుకున్నారు. నిర్మాణ బాధ్యతలను బిడ్డింగ్ ద్వారా జీఎంఆర్కు అప్పగించారు. అయితే నిరభ్యంతరపత్రాన్ని నవీనకరించలేదన్న కారణంగా ఈరోజు వరకు పనులు ప్రారంభించలేదు.