ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kerala CM Meet KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​తో కేరళ ముఖ్యమంత్రి భేటీ - cm kcr

Kerala cm meet KCR: ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరానికి వచ్చిన పినరయి విజయన్‌తో పాటు సీపీఎం జాతీయ నాయకులను కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్​తో కేరళ ముఖ్యమంత్రి భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్​తో కేరళ ముఖ్యమంత్రి భేటీ

By

Published : Jan 8, 2022, 6:58 PM IST

Kerala cm meet KCR: కేరళ ముఖ్యమంత్రి వినరయి విజయన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హైదరాబాద్‌ నగరానికి వచ్చిన పినరయి విజయన్‌తో పాటు సీపీఎం జాతీయ నాయకులను కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కేరళ సీఎంతోపాటు సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్‌, బాలక్రిష్ణన్‌, ఎస్‌ఆర్‌పీ ఎంఏ బాబీలు ప్రగతిభవన్‌కు చేరుకుని కేసీఆర్‌తో కలిసి భోజనాలు చేశారు.

భోజనం అనంతరం కేసీఆర్​తో కేరళ సీఎం పినరయి విజయన్​, సీతారాం ఏచూరి సమావేశమయ్యారు. సీపీఎం కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ హైదరాబాద్​ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్​ వారిని భోజనానికి ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details