ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRS party President KCR : తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనమే! - Telangana Rashtra Samithi party president

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్(TRS party President KCR)​ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. తెరాస పార్టీ ద్విదశాబ్ద వేడుకల్లో భాగంగా ఇవాళ నిర్వహిస్తోన్న తెరాస ప్లీనరీ సమావేశంలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు. పార్టీ పటిష్ఠత, ఇతర అంశాలపై శ్రేణులకు ప్లీనరీలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

KCR
KCR

By

Published : Oct 25, 2021, 9:14 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(TRS party President KCR) ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగే పార్టీ ప్లీనరీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తెరాస పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిపై శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

అలా మొదలై...

2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో తెరాస(Telangana Rashtra Samithi) ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన పలు ప్లీనరీల్లో ఆయన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనే అధ్యక్షుడు(TRS party President KCR) కానున్నారు. దేశంలో సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వారిలో కేసీఆర్‌(TRS party President KCR) ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్‌... ఉపసభాపతి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెరాసను స్థాపించారు. ఆ తర్వాత ఉద్యమపంథాలోనే పార్టీని నడిపించారు.

పార్టీ నిర్మాణంపై దృష్టి

2014లో తెరాస(TRS) అధికారంలోకి వచ్చాక పార్టీ నిర్మాణంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. సంస్థాగత ఎన్నికలకు ప్రాధాన్యమిచ్చారు. 2018 డిసెంబరులో తెరాస కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు కేటీ రామారావుకు అప్పగించారు. గత రెండేళ్లుగా ఆయన ప్రణాళికాబద్ధంగా పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పార్టీపరంగా కార్యకర్తలను ఆదుకోవడంతో పాటు ఆధునిక హంగులతో వారిని సుశిక్షితులను చేస్తున్నారు.

మరింత పటిష్ఠంగా...

ద్విదశాబ్ది ఉత్సవాల(TRS party 20 years celebrations) సందర్భంగా సంస్థాగత పటిష్ఠతపై తెరాస దృష్టి సారిస్తోంది. బస్తీ, గ్రామ, మండల, డివిజన్‌ కమిటీల ఎన్నికలను నిర్వహించింది. జిల్లా, రాష్ట్ర కమిటీలు రానున్నాయి. పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. దీని కోసం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. పార్టీయే సర్వస్వంగా పనిచేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా శ్రేణులు ఉండాలని తెరాస భావిస్తోంది. ఆదివారం జరిగే అధ్యక్ష ఎన్నిక అనంతరం కేసీఆర్‌ పార్టీ నిర్మాణ ప్రణాళికను వివరిస్తారు. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో పార్టీ పటిష్ఠానికి త్వరలో మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నాయి.

  • ఇదీ చదవండి :

ORGANIC FARMING: భూమి పుత్రుడు.. అనితర ‘సేద్యుడు’!

ABOUT THE AUTHOR

...view details