తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ సమావేశం ముగిసింది. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో 6 గంటలపాటు సమావేశం కొనసాగింది. విభజన సమస్యలు, గోదావరి జలాల మళ్లింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై చర్చించినట్లు సమాచారం. ఎన్‌పీఆర్,ఎన్‌ఆర్‌సీపై చర్చజరిగినట్లు తెలుస్తోంది.
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
19:48 January 13
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
18:48 January 13
సుదీర్ఘంగా కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్-కేసీఆర్‌ల సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. 5 గంటల పాటు ఇరువురు ముఖ్యమంత్రుల చర్చలు జరుగుతున్నాయి.
12:27 January 13
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ
తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ లు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రగతిభవన్ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైయ్యారు.
11:55 January 13
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరికాసేపట్లో.. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే అవకాశముంది. ఈ సమావేశానికి అధికారులను పిలవలేదు. ఇద్దరే ఏకాంతంగా చర్చించుకోనున్నారని సమాచారం. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఇద్దరూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనం కోసం గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధానంగా చర్చ జరిగే వీలుందని భావిస్తున్నారు. వీటితో పాటు తొమ్మిది, పదో షెడ్యూల్డ్ సంస్థల విభజన, ఇతర పెండింగ్ అంశాలపైనా చర్చిస్తారని సమాచారం. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపుపైనా చర్చిస్తారని తెలిసింది. ఇద్దరు సీఎంల మధ్య గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షిస్తారు. అనంతరం తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడుకునే వీలున్నట్లు సమాచారం.