ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్​కు లేదు' - telangana news

తెలంగాణలో... మంత్రి కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని... కావాలనే లీకులు ఇస్తున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమన్నారు.

kcr-has-no-intention-of-appointing-ktr-as-cm
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By

Published : Jan 5, 2021, 2:08 PM IST

తెలంగాణలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని... కావాలనే లీకులు ఇస్తున్నారని చెప్పారు. మరో మూడేళ్లు సీఎంగా కేసీఆర్​ కొనసాగుతారని అంచనా వేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్​కు జనగామ జిల్లా పెంబర్తి వద్ద భాజపా శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. అనంతరం జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో అల్పాహారం చేశారు.. బండి సంజయ్.

తెరాస కుటుంబ, అవినీతి పాలనే భాజపా విజయానికి కారణం. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసి గెలవాలన్నదే కేసీఆర్ ఆలోచన. డబ్బు పంపిణీ చేసినా దుబ్బాక, గ్రేటర్‌లో తెరాసకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆలోచన విధానం మార్చుకోవాలి.

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను బయటపెడతామని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం అని... తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విన్నవించినా... కలిసి రావడం లేదని చెప్పారు. త్వరలోనే అవినీతి పాలనకు చరమగీతం పాడి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details