రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కౌలాలంపూర్ నుంచి విశాఖ వచ్చిన ఓ కుటుంబం జలుబు, దగ్గుతో విశాఖ చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి రక్త నమూనాలను వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రెండు కరోనా అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. పెంటపాడు గ్రామానికి చెందిన సత్తిబాబు ఈనెల 18న మస్కట్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతను, అతని మేనమామ గురునాథ్ 4 రోజులుగా జ్వరం. జలుబుతో బాధపడుతూ.. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రి వైద్యులు కరోనా కేసులుగా అనుమానించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారిద్దరికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారికి వైరస్ సోకిందా లేదా అనేదానిపై అధికారులు ఎలాంటి నిర్ధరణకు రాలేదు.