కరీంనగర్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అగ్రరాజ్య అధినేత జోబైడెన్ సలహాదారుల జాబితాలో జిల్లాలోని హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఉండటం విశేషం. శ్వేతసౌధం స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా చొల్లేటి వినయ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించటం పట్ల జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా తమిళనాడు సంతతికి చెందిన కమలాహారీస్ ఎన్నిక కాగా... వైట్‌హౌజ్ స్పీట్ రైటింగ్ డైరెక్టర్‌గా తెలంగాణ సంతతికి చెందిన వినయ్‌రెడ్డి నియామకం కావటం ఇప్పడు ప్రాధాన్యం సంతరించుకుంది.
బైడెన్‌కు స్పీచ్‌రైటర్‌గా కరీంనగర్ జిల్లా సంతతి వ్యక్తి
అప్పటి నుంచే...
గ్రామానికి చెందిన చొల్లేటి నారాయణరెడ్డి 1970లో అమెరికా వెళ్లి ఆక్కడే స్థిరపడ్డారు. నారాయణరెడ్డికి ముగ్గురు కుమారులు కాగా.. వినయ్‌రెడ్డి మూడోవాడు. అమెరికాలో లా కంప్లీట్ చేసిన వినయ్‌రెడ్డి మొదట యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌కు స్పీచ్ రైటర్‌గా పని చేశారు. 2012 రీ ఎలక్షన్ సమయంలో ఒబామాకు, బైడెన్‌కు స్పీచ్ రైటర్‌గా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో బైడైన్, కమలా హారిస్‌లకు స్పీచ్ రైటర్‌తో పాటు ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు వైట్‌హౌజ్ స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియామకమయ్యారు.