9 Years Child Girls died in road accident: తెలంగాణలోని కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిలోని తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల చిన్నారి శివాని అక్కడికక్కడే చనిపోయింది. ఇంటి నుంచి బయలుదేరిన చిన్నారి.. తన తల్లి పనిచేసే మొబైల్ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు చిన్నారిని ఢీకొట్టి.. విద్యుత్ స్తంభాన్ని తాకి ఆగిపోయింది. కారు ఢీకొన్న వేగానికి చిన్నారి గాలిలోకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. కేవలం అరకిలోమీటర్ దూరంలో ఉన్న తల్లి వద్దకు చేరుకొనే లోపే ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ చిన్నారి... అక్కడికక్కడే మృతి - Road accident in karimnagar district
Road accident: తల్లిని చూసేందుకు వెళ్తున్న ఓ చిన్నారిని రోడ్డుప్రమాదం చిదిమేసింది. దగ్గరే కదా అని రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా విధి వక్రించింది. కారుపై నియంత్రణ కోల్పోయిన ఓ డ్రైవర్.. ఆ చిన్నారిని ఢీకొట్టాడు. కారు వేగానికి గాల్లోకి ఎగిరి కిందపడిన ఆ 9ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చోటుచేసుకుంది.
Road accident in karimnagar district
ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. చిన్నారి కుటుంబం చిగురుమామిడి మండలం ఇందుర్తి నుంచి ఉపాధి కోసం వలస వచ్చి తిమ్మాపూర్‌లో నివాసముంటోంది. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అతి వేగమే చిన్నారి మరణానికి కారణంగా తెలుస్తోంది.
ఇవీ చదవండి:ఆర్మీలో ఉద్యోగం రాదని.. యువకుడు ఆత్మహత్య!