Karate kalyani complaint : ఆధ్మాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ నిర్వాహకులపై.. సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ నిర్వాహకుల నుంచి తనకు ప్రాణభయం ఉన్నట్లు బంజారాహిల్స్ పోలీసులకు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'శివశక్తి ఫౌండేషన్ నిర్వాహకులతో నాకు ప్రాణభయం ఉంది' హిందువుల విరాళాలతో కంపెనీ రుణాలు తీసుకున్నారని నిరూపించడంతో.. తనపై అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు.. దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకొని తనక రక్షణ కల్పించాలని కరాటే కల్యాణి కోరారు.
'శివశక్తి ఫౌండేషన్‌పై సీసీలో రెండో తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కోపంతో వాళ్లు ప్రజలను రెచ్చగొడుతున్నారు. వాళ్ల భక్తులు నామీద దాడి చేసేలా ప్రోవోక్ చేస్తున్నారు. వెబ్ మీడియాల్లో ఫేక్ న్యూస్ రాయిస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నేను సమాజంలో బతుకుతున్నాను. అడవిలో కాదు. నాకు ఫ్యామిలీ ఉంది. ఆధ్యాత్మిక వేదిక శివశక్తి ఫౌండేషన్ వాళ్లు ప్రజల సొమ్ము రూ.4 కోట్లు తిన్నారు. దానినే నేను ప్రశ్నించాను. నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. అందుకే నామీద దుష్ప్రచారం చేస్తున్నారు. శివశక్తి ఫౌండేషన్ నుంచి నాకు ప్రాణభయం ఉంది. చంపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ల భక్తులు నన్ను కొడితే ఎవరు బాధ్యులు?'
-కరాటే కల్యాణి, సినీ నటి
ఇదీ చదవండి:Chandrababu Kuppam Tour: ఈనెల 6 నుంచి.. కుప్పంలో చంద్రబాబు పర్యటన