ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు' - kanna laxminarayana comments on chandrababu

తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తెదేపాకు అమిత్‌షా ఎప్పుడో శాశ్వతంగా తలుపులు మూసేశారని పేర్కొన్నారు.

తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు

By

Published : Oct 19, 2019, 5:14 PM IST

రాజకీయ విలువలు లేని తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అవినీతే లక్ష్యంగా అవకాశవాద రాజకీయాలతో యూ-టర్న్​లు తీసుకుంటూ... దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన తెదేపా... ఇప్పుడు ఏ మొహంతో పొత్తుకోసం వెంపర్లాడుతోందని ప్రశ్నించారు. అమిత్​షా తెదేపాకు శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారు పేర్కొన్నారు.

తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు

ABOUT THE AUTHOR

...view details