తమిళనాడులోని తితిదే భూముల అమ్మకంపై తితిదే నిర్ణయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
హిందువుల మనోభావాలపై వైకాపా ప్రభుత్వానికి గౌరవం లేదన్న ఆయన... హిందూ ఆలయాలను నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూమతాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో వైకాపా ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని నిరూపితమైందని అన్నారు. హిందూ ఆలయాల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు కదిలివస్తారని హెచ్చరించారు.