రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం లాక్‌డౌన్ సడలించే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ఆయన రాసిన లేఖలో.. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ఇప్పటికే చాలా దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ... లాక్‌డౌన్ నిర్ణయాన్ని అభినందించాయని తెలిపారు. ఒడిశా, తెలంగాణ బాటలో ఈ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పేరుతో.. రెడ్‌జోన్లకే ఆంక్షలు పరిమితం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించండి: సీఎంకు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ - సీఎంకు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ
లాక్‌డౌన్ నెలాఖరు వరకు పొడిగించాలని సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పేరుతో రెడ్‌జోన్లకే ఆంక్షలు పరిమితం చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.
సీఎంకు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ